‘రాకా’లో ఆ వైల్డ్ లుక్ తోనే బన్నీ ఎంట్రీ ?

‘రాకా’లో ఆ వైల్డ్ లుక్ తోనే బన్నీ ఎంట్రీ ?

Published on Oct 4, 2026 1:07 PM IST

raaka

‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ’ ‘రాకా’ సినిమా అప్ డేట్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎంట్రీ పై ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. బన్నీ ఎంట్రీ సాధారణ హీరో ఇంట్రడక్షన్‌లా కాకుండా భారీ ఎలివేషన్‌ తో పాటు ఆ మధ్య రిలీజ్ చేసిన వైల్డ్ లుక్ తాలూకు పాత్రతోనే బన్నీని పరిచయం చేసి.. ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేస్తారట. అంటే.. బన్నీ ఎంట్రీ సీన్ ను సినిమాలో హుక్ పాయింట్ గా ప్లాన్ చేశారు. ఈ నెల మూడో వారం నుంచి ‘రాకా’ కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుందని తెలుస్తోంది.

కాగా ఈ సినిమాలో దీపికా పడుకోణెతో పాటు మృణాల్ ఠాకూర్ కూడా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే, జాన్వీ కపూర్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక బన్నీ కోసం అట్లీ ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను పూర్తి చేశాడు. కాగా మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ డాన్ చుట్టూ ఈ కథా నేపథ్యం సాగుతుందట. అలాగే, ఈ సినిమా కోసం అట్లీ ప్రత్యేకంగా గెస్ట్ రోల్స్ ను డిజైన్ చేస్తున్నాడట. మొత్తానికి ఈ సినిమా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు