విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన నారప్ప చిత్రం విడుదల కి సిద్దం అయింది. ఈ చిత్రం పోస్టర్ విడుదల అయిన అనంతరం నుండి సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా ఈ చిత్రం నుండి విడుదల అయిన ట్రైలర్ సినిమా పై అంచనాలను మరింతగా పెంచేసింది. అయితే ఈ చిత్రం ట్రైలర్ తో పాటుగా పాటలు సైతం ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ చిత్రం జూలై 20 వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ విడియో ద్వారా అందరికీ అందుబాటులో ఉండనుంది.
జూలై 19 వ తేదీన రాత్రి పది గంటలకు మొదటగా స్ట్రీమ్ కానుంది. అయితే ఈ చిత్రం తమిళం లో సెన్సేషన్ సృష్టించిన ధనుష్ నటించిన అసురన్ చిత్రానికి రీమేక్. ఈ చిత్రం లో వెంకటేష్ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ఈ చిత్రం లోని సన్నివేశాలు పతాక స్థాయిలో ఉండగా, డైలాగులు సైతం ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠ గా ఉండటం తో సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.


