ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ శ్రీహాన్ “ఆవారా జిందగి” ఫస్ట్ లుక్

ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ శ్రీహాన్ “ఆవారా జిందగి” ఫస్ట్ లుక్

Published on Oct 4, 2022 10:16 AM IST

ఫన్ ఓరియెంటెడ్ మూవీగా ఓ యూత్ ఫుల్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఆవారా జిందగి మూవీ. నేటితరం ఆడియన్స్ మెచ్చే కథ ఎంచుకొని దానికి కావాల్సినంత ఫన్ యాడ్ చేస్తూ థియేటర్స్ లో మజా చేసేందుకు సిద్ధమవుతోంది. ఫన్ ఫిల్డ్ ఎంటర్ టైనర్ మూవీగా రాబోతున్న ఈ ఆవారా జిందగి చిత్రానికి దేప శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. విభా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నంద్యాల మధు సూదన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఒక్కో అప్డేట్ వదులుతూ ఆసక్తి పెంచుతున్నారు మేకర్స్. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది.

ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ అందుకుంది ఈ ఆవారా జిందగి ఫస్ట్ లుక్ పోస్టర్. సినిమా కథను రిప్రెజెంట్ చేసేలా నలుగురు కుర్రాళ్లతో ఈ పోస్టర్ డిజైన్ చేశారు. పోస్టర్ లో కనిపిస్తున్న చార్మినార్, పిస్తోల్, 2000 రూపాయల నోట్లు అలాగే ఆ నలుగురి లుక్స్ ఈ సినిమాలో వైవిధ్యం ఉండనుందని స్పష్టం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఆ నలుగురి ఆవారా పనులు ఎలా ఉండబోతున్నాయి? ఆ పనులకు కామెడీ ఎలా లింక్ చేశారు? తమ క్యారెక్టర్స్‌తో ఈ ఆవారా కుర్రోళ్ళు ప్రేక్షకులను ఎలా ఎంటర్‌టైన్ చేస్తారు అనేది థియేటర్స్ లో చూడాలి.

బిగ్ బాస్ శ్రీహాన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ ఆవారా జిందగి సినిమాను ఆడియన్స్ కోరుకునే విధంగా కామెడీ ప్రధానాంశంగా తెరకెక్కించారు. నలుగురు కుర్రోళ్ళ నడుమ నడిచే ఫుల్ లెంగ్త్ కామెడీతో ఈ సినిమాను గ్రాండ్ గా రూపొందిస్తున్నారు. జీరో లాజిక్ 100 % ఫన్ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా వస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించేలా ఈ సినిమా కథ ఎంచుకొని ఇంట్రెస్టింగ్ లొకేషన్స్ లో తెరకెక్కించారు మేకర్స్. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అతిత్వరలో ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించనున్నారు.

బిగ్ బాస్ శ్రీహాన్, ముక్కు అజయ్, ఢీ చెర్రీ, జస్వంత్, షియాజీ షిండే, సద్దాం, టార్జాన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం దేప శ్రీకాంత్ రెడ్డి, నిర్మాత నంద్యాల మధుసూదన్ రెడ్డి, కో ప్రొడ్యూసర్ కంభంపాటి విజయ్ కుమార్, మ్యూజిక్ ప్రతీక్ నాగ్, సినిమాటోగ్రాఫర్ శ్యామ్ ప్రసాద్ V, ఉరుకుంద రెడ్డి S, ఎడిటర్ S B రాజు తలారి లుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు