యూఎస్లో మంచి రిలీజ్ పొందనున్న నాని చిత్రం !


ప్రముఖ నటుడు నాని నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం ‘అ!’. టైటిల్ ప్రకటన రోజు నుండి ప్రేక్షకుల్లో అమితాసక్తిని రేకెత్తిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. కాజల్, రెజినా, నిత్యా మీనన్ వంటి స్టార హీరోయిన్లు నటించనుండటం, ట్రైలర్, టీజర్ రెండూ బాగుండటంతో అసలు సినిమా కాన్సెప్ట్ ఏమిటో తెలుసుకోవాలని ప్రేక్షకుల్లో కుతూహలం బయలుదేరింది.

దీంతో సినిమా యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరుగుతోంది. ముఖ్యంగా ఓవర్సీస్ ప్రేక్షకుల్లో కూడా సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అందుకే అక్కడి డిస్ట్రిబ్యూటర్లు చిత్రాన్ని 110 కి పైగా లొకేషన్లలో రిలీజ్ చేయనున్నారు. ఈ రిలీజ్ తో సినిరంకు మంచి ఓపెనింగ్స్ దక్కే అవకాశాలున్నాయి. ఫిబ్రవరి 16న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేశారు.