ఏపి, తెలంగాణాల్లో ‘బాహుబలి-2’ 10 రోజుల వసూళ్ల వివరాలు !
Published on May 8, 2017 5:40 pm IST


విడుదలైన ప్రతి భాషలో గత రికార్డుల్ని తిరగరాస్తూ సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తున్న చిత్రం ‘బాహుబలి – ది కంక్లూజన్’ తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని విధంగా నడుస్తోంది. ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో మొదటిరోజున్న ఉత్సాహమే 10వ రోజు కూడా కనిపించింది. దీంతో నిన్న ఆదివారం నాడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో సినిమా హౌజ్ ఫుల్ కలెక్షన్లతో నడిచింది.

10 రోజులకు గాను నైజాంలో రూ. 44. 90 కోట్లు రాబట్టిన ఈ చిత్రం, సీడెడ్లో రూ. 24. 59 కోట్లు, నెల్లూరులో రూ. 5. 41 కోట్లు, గుంటూరులో రూ. 13. 50 కోట్లు, కృష్ణాలో రూ. 9. 88 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 9.97 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 13.31 కోట్లు, ఉత్తరాంధ్రలో 18. 14 కోట్లు కలిపి మొత్తంగా రూ. 139. 70 కోట్ల షేర్ ను నమోదు చేసింది. అంతేగాక ఈ చిత్రం నిన్నటితో ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్ల గ్రాస్ అందుకుని 1500 కోట్ల దిశగా పరుగులుపెడుతోంది.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook