‘బాహుబలి – ది బిగెనింగ్’ రన్ టైం డీటైల్స్

‘బాహుబలి – ది బిగెనింగ్’ రన్ టైం డీటైల్స్

Published on Jul 8, 2015 5:03 PM IST

Baahubali-tamil
భారత చలన చిత్ర చరిత్రలో మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో అత్యంత భారీ బడ్జెట్ తో, అబ్భురపరిచే భారీ విహ్వాల్ ఎఫెక్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న ప్రతిష్టాత్మక మూవీ ‘బాహుబలి’. సక్సెస్ ని తన ఇంటిపేరుగా పరచుకున్న ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్ కి మరో 2 రోజులు మాత్రమే మిగిలి ఉంది. అనగా జూలై 10న అత్యధిక థియేటర్స్ లో నాలుగు భాషల్లో(తెలుగు, తమిళ, మలయాళ, హిందీ) రిలీజ్ కానుంది. రాజమౌళి, అతని టీం ఎన్నో రోజులు రాత్రింబవళ్ళు కష్టపడి నిన్నటితో అన్ని కార్యక్రమాలను ఫినిష్ చేసి ఫస్ట్ ఫైనల్ కాపీని సిద్దం చేసారు.

అలాగే ఇప్పటికే ఈ సినిమా హార్డ్ డిస్క్ లను ఓవర్సీస్ కి చేర్చేసారు కూడా.. ఇదిలా ఉంటే మాకు అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా రన్ టైంని ఇంతకి లాక్ చేసారనేది తెలిసింది. ‘బాహుబలి- ది బిగెనింగ్’ టోటల్ రన్ టైం 2 గంటల 39 నిమిషాల 47 సెకన్లు. టోటల్ స్మోకింగ్ యాడ్స్ తో కూడా కలుపుకొని ఈ రన్ టైంని ఫిక్స్ చేసారు. దీని ప్రకారం సుమారు 2 గంటల 35 నిమిషాల పాటు రాజమౌళి థియేటర్ లో ప్రేక్షకులను తన గ్రాండ్ విజువల్స్, అడ్వెంచర్స్, వార్ సీక్వెన్స్ లతో థ్రిల్ చేయనున్నాడు. ప్రస్తుతం అన్ని ఏరియాల్లో బాహుబలి బెనిఫిట్ షోస్ టికెట్స్ కోసం భారీ ఎత్తున క్రేజ్ నెలకొంది.

ప్రభాస్ కి పోటీ ఇచ్చే ఆరడుగుల కండల వీరుడుగా రానా దగ్గుబాటి కనిపించాడు. జక్కన్న అని ముద్దుగా పిలుచుకునే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా కనిపించారు.

తాజా వార్తలు