టాలీవుడ్ సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెలుగు చలన చిత్ర చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘బాహుబలి’. గత కొన్ని రోజులుగా ఈ చిత్ర టీం భారీ వర్షం పడుతూ, మంచు కురుస్తున్నా ఎక్కడా బ్రేక్ ఇవ్వకుండా మహాబలేశ్వర్ లో షూటింగ్ చేసారు. నేటితో బాహుబలి మహాబలేశ్వర్ షెడ్యూల్ ముగిసింది. ఈ సినిమా అతాజా షెడ్యూల్ సెప్టెంబర్ 12 నుంచి రామోజీ ఫిలిం సిటీలో మొదలు కానుంది.
‘షెడ్యూల్ పాకప్.. బై బై వర్షం, బై బై చలి, బై బై మంచు, బై బై మహా బలేశ్వర్.. న్యూ షెడ్యూల్ సెప్టెంబర్ 12 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలవుతుందని’ ఎస్ఎస్ రాజమౌళి ట్వీట్ కూడా చేసారు. ప్రభాస్, రానా అన్నదమ్ములుగా కనిపించనున్న ఈ సినిమాలో అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో మొదటి పార్ట్ ని 2015 ఏప్రిల్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు..



