రజనీ కోసం ‘బాహుబలి-2’ టెక్నీషియన్ !
Published on May 16, 2017 8:51 am IST


ప్రస్తుతం ‘రోబో-2’ లో నటిస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ అది పూర్తైన వెంటనే ‘కబాలి’ ఫేమ్ పా. రంజిత్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మాఫియా నైపథ్యంలో రూపొందనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రం కోసం భారీ బడ్జెట్ ను కేటాయించిన నిర్మాతలు టెక్నీషియన్ల విషయంలో కూడా ఎక్కడా కాంప్రమైజ్ కావడంలేదు.

సినిమాలోని విఎఫ్ఎక్స్ డిజైన్ కోసం సూపర్ హిట్ ‘బాహుబలి-2’ చిత్రం కోసం పని చేసిన విఎఫ్ఎక్స్ నిపుణుడు పెటే డ్రాపర్ ను ప్రాజెక్టులోకి తీసుకున్నారట. మకుట సంస్థకు చెందిన ఈయన ‘మగధీర, ఈగ, గజినీ, బాహుబలి’ వంటి భారీ సినిమాలకు పని చేశారు. ఈయన చేత ముంబైలోని ధారావి ఏరియా ఎఫెక్ట్స్ ను చెన్నైలో వేసిన సెట్స్ పై సృష్టించనున్నారట. ఇకపోతే ఈ ప్రాజెక్టును మే 28 నుండి ఆరంభించనున్నారు.

 
Like us on Facebook