మంచు విష్ణు తాజాగా చేస్తున్న సినిమా కన్నప్ప. పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ చిత్రం కోసం విష్ణు కఠినంగా కష్టపడుతున్నాడు. రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూట్ కూడా పూర్తి చేశారు. కాగా కన్నప్ప లో అక్షయ్ కుమార్ శివుడిగా కనిపించనున్నారని టాక్. ఈ సినిమా కోసం అక్షయ్ ఏకంగా రూ. 6 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నట్లు టాక్.
అన్నట్టు కన్నప్పలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఓ కీలక పాత్ర చేయనున్నాడు. ఆదివాసీ తెగకు సంబంధించిన ఒక పాత్రలో మోహన్‌లాల్ మెరవనున్నాడు. అలాగే, ప్రభాస్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నాడు. పైగా ఈ సినిమాలో మరిన్ని సర్ప్రైజ్ లు ఉంటాయట. ముఖ్యంగా చాలా మంది స్టార్స్ పేర్లు కూడా ఈ సినిమాలో యాడ్ కాబోతున్నాయని తెలుస్తుంది.