‘ది ఫ్యామిలీ మ్యాన్ – 3’ మొదలైంది

‘ది ఫ్యామిలీ మ్యాన్ – 3’ మొదలైంది

Published on May 6, 2024 4:00 PM IST

‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సీరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఐతే, ఇప్పటివరకు ఈ సిరీస్ రెండు సీజన్లుగా వచ్చింది. రెండో సీజన్ కూడా బాగా మెప్పించింది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ మూడో సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా మూడో సీజన్ కి సంబంధించి షూటింగ్‌ను ప్రారంభించినట్లు మేకర్స్ ప్రకటించారు. మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి, శరీబ్ హష్మీ తదితరులు నటిస్తున్న ఈ సిరీస్‌ కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు.

మూడో సీజన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని.. ముఖ్యంగా థ్రిలింగ్ ఎలిమెంట్స్ ఈ సీజన్ లో బాగా వర్కౌట్ అవుతాయని తెలుస్తోంది. ఈ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ మూడో సీజన్ అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం తెరకెక్కుతుంది. అన్నట్టు ఈ మూడో సీజన్ లో కొందరు సౌత్ నటీనటులు కూడా కనిపించనున్నారు. వారు ఎవరు అనేది త్వరలోనే తెలియనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు