బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తన మాజీ లవర్స్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. గతంలో షాహిద్ కపూర్ కొంతమంది హీరోయిన్స్ తో డేటింగ్ చేశాడు. ఐతే, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో షాహిద్ కపూర్ వారి పై స్పందించాడు. ఇంటర్వ్యూలో షాహిద్ కపూర్ కి ఓ ప్రశ్న ఎదురయ్యింది. ‘ నువ్వు ప్రేమించి ఎన్నిసార్లు మోసం చేశావు ?’ అని సదరు యాంకర్ అడిగారు. ఆ ప్రశ్నకు షాహిద్ కపూర్ స్పందిస్తూ.. ‘నాకు ఒక విషయం ఖచ్చితంగా తెలుసు. నేను ప్రేమించిన అమ్మాయిలే నన్ను మోసం చేశారు. నేను ఎవర్నీ మోసం చేయలేదు’ అని షాహిద్ కపూర్ చెప్పుకొచ్చాడు.
గతంలో షాహిద్ కపూర్ కరీనా కపూర్, ప్రియాంక చోప్రా లాంటి స్టార్ హీరోయిన్స్ తో డేటింగ్ చేశాడు. మరి ఈ కామెంట్స్ ను వారి గురించే అని టాక్. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోగా షాహిద్ కపూర్ దూసుకువెళ్తున్నాడు. ఇక షాహిద్, మీరా రాజ్‌పుత్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.