ప్రచారంతో హోరెత్తిస్తున్న ‘బాబు బాగా బిజీ’ !


శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘బాబు బాగా బిజీ’. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై నవీన్ మేడారం డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మే 5న రిలీజ్ కానుంది. బాహుబలి-2 విడుదల తర్వాత కేవలం వారం వ్యవధిలోనే రిలీజ్ కానుండటంతో అందరిలోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఆ ఆసక్తిని గమనించిన చిత్ర టీమ్ దాన్ని అలాగే కొనసాగించే ప్రయత్నాలు చేస్తోంది.

అందులో భాగంగానే మీడియాతో బాగా ఇంటరాక్ట్ అవుతూ పలకరిస్తున్నారు టీమ్. అంతేగాక వైవిధ్యమైన హాట్ హాట్ పోస్టర్లతో, సినిమా స్వభావం ఉట్టిపడే టీజర్లతో జనాలను ముఖ్యంగా బి, సి సెంటర్ల ఆడియన్సును బాగా ఆకట్టుకుంటోంది. దీంతో ఇంత పెద్ద బాహుబలి హవాలో కూడా ప్రేక్షకులు ఈ చిత్రం గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. హిందీ సినిమా ‘హంటర్’ కు రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీనివాస్ అవసరాలకు జంటగా తేజస్వి మదివాడ, మిస్తి చక్రవర్తి, శ్రీముఖి, సుప్రియ ఐసోల నటిస్తున్నారు.