అభిమానులకు మెగా హీరోల బంపర్ ఆఫర్లు !
Published on Dec 31, 2016 9:37 am IST

khaidi-kat-mister
ఈ 2016 సంవత్సరం ఆఖరు మెగా హీరోల సందడితో కళకళలాడిపోతోంది. అభిమానులకు రానున్న కొత్త సంవత్సరానికి బహుమతులుగా మెగా హీరోలు రాబోయే తమ సినిమాల పాటలు, మోషన్ పోస్టర్స్, ఫస్ట్ లుక్స్ ను వరుసగా విడుదల చేస్తూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. నిన్న రాత్రి 10 గంటల సమయంలో పవన్ కళ్యాణ్ తన ‘కాటమరాయుడు’ సినిమా మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసి సందడి మొదలుపెట్టగా తరువాత మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెం 150’ లోని స్పెషల్ సాంగ్ ‘రత్తాలు’ విడుదల చేసి హంగామాను తారా స్థాయికి తీసుకెళ్లారు.

ఇక మెగా హీరోల్లో వరుణ్ తేజ్ శ్రీను వైట్ల డైరెక్షన్లో చేస్తున్న ‘మిస్టర్’ టైటిల్ పోస్టర్ ను అందరికన్నా ముందే సాయంత్రం విడుదల చేయగా ఈరోజు ఫస్ట్ లుక్, టీజర్ ను రిలీజ్ చేసి హీట్ ను మరింత పెంచనున్నాడు. అలాగే మరో మెగా హీరో ధరమ్ తేజ్ తన ‘విన్నర్’ చిత్రం పోస్టర్లను కూడా ఈరోజే రిలీజ్ చేయనున్నాడు. ఇలా నలుగురు మెగా హీరోలు ఒకేసారి బ్యాక్ టు బ్యాక్ బంపర్ ఆఫర్లు ఇస్తుండటంతో అభిమానుల్లో న్యూ ఇయర్ సందడి తార స్థాయికి చేరుకుంది. తమ అభిమాన హీరోలు ఇస్తున్న ఈ ఆఫర్ కు ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

 
Like us on Facebook