చైతు కోసం మరో కొత్త రకం ప్రేమకథ !

చైతు కోసం మరో కొత్త రకం ప్రేమకథ !

Published on Dec 20, 2018 9:36 PM IST

అక్కినేని నాగ చైతన్య కోసం ఓ మంచి లవ్ స్టోరీ రాస్తున్నానని గతంలో ఓ ఇంటర్వ్యూలో స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ స్క్రిప్ట్ పూర్తయిందట. ఈ మధ్య వరుస ప్లాప్ లతో బాక్సాఫీస్ వద్ద కాస్త వెనుక పడిన చైతూకి ఎలాగైన ఓ మంచి స్క్రిప్ట్ అందివ్వాలనే ఉద్దేశ్యంతో విజయేంద్ర ప్రసాద్ ఈ స్క్రిప్ట్ రాసారు.

కాగా ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారో ఇంకా తెలియాల్సి ఉంది. నాగ చైతన్య ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో తన సతీమణి సమంతతో కలిసి ‘మజిలీ’ చిత్రం షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నారు. చైతు, సమంత పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్న తొలి చిత్రం ‘మజిలీ’నే కావడంతో ఆ చిత్రం పై అక్కినేని అభిమానుల్లో ఆసక్తి ఏర్పడింది.

హిందీ నటి దివ్యంశ కౌశిక్ కీలక పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. సాహు గరపాటి ,హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు