సోషల్ మీడియాలో బాలయ్య హవా…అఖండ మరియు అన్ స్టాపబుల్ తో!

Published on Nov 9, 2021 5:00 pm IST

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరో గా నటిస్తున్న తాజా చిత్రం అఖండ. ఈ చిత్రం ను ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, విడియోలు సినిమా పై భారీ అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ చిత్రం నుండి భం అఖండ సాంగ్ విడుదలైంది. ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అంతేకాక యూ ట్యూబ్ లో ఈ లిరికల్ వీడియో సాంగ్ కి 3 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి.

అదే విధంగా బాలకృష్ణ మొట్ట మొదటి సారిగా ఒక టాక్ షో కి వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్నారు. అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే గా వస్తున్న ఈ షో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. రెండవ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ రెండవ ఎపిసొడ్ కి గెస్ట్ గా నాని రావడం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ నవంబర్ 12 వ తేదీన ఆహా వీడియో లో ప్రసారం కానుంది. ఈ ప్రోమో వీడియో సైతం 3 మిలియన్స్ వ్యూస్ కి పైగా దక్కించుకుంది. మొత్తానికి ఈ రెండు వీడియో లతో సోషల్ మీడియాలో మరియు యూ ట్యూబ్ లో బాలయ్య బాబు ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :