ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన బాలక్రిష్ణ !

5th, February 2018 - 11:30:16 AM

కొన్నాళ్లుగా కుడి భుజం సమస్యతో భాదపడుతున్న నందమూరి బాలక్రిష్ణ గత శనివారం హైదాబాద్లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో మేజర్ సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ విజయవంతంగా పూర్తైంది. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్న బాలయ్య ఈరోజు ఉదయం 10 గంటల 30 నిముషాలకు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.

ఈ ఆపరేషన్ నుండి పూర్తిగా కోలుకోవడానికి సుమారు 5 నుండి 6 నెలలు పడుతుందని, అప్పటి వరకు విశ్రాంతి తీసుకోమని డాక్టర్లు బాలయ్యకు సలహా ఇచ్చారట. పూర్తిగా కోలుకున్న వెంటనే బాలక్రిష్ణ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ‘ఎన్టీఆర్’ చిత్ర పనుల్లో తిరిగి పాలుపంచుకోనున్నారు.