పాటల కోసం దుబాయ్ వెళ్లనున్న బాలక్రిష్ణ !
Published on Nov 26, 2017 2:49 pm IST

నందమూరి బాలక్రిష్ణ 102వ చిత్రం ‘జై సింహ’ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దాదాపు షూటింగ్ ముగించేసిన బాలక్రిష్ణ మిగిలివున్న రెండు పాటల చిత్రీకరణ కోసం దుబాయ్ వెళ్లనున్నారు. ఈ రెండు పాటల్లో ఒకటి బాలక్రిష్ణ, నయనతారల మధ్యన కాగా ఇంకొకటి బాలక్రిష్ణ నటాషా దోషిల కలయికలో ఉండనుంది.

ఈ షెడ్యూల్ డిసెంబర్ 7 నుండి 17 వరకు జరగనుంది. ఈ షెడ్యూల్ తో షూటింగ్ పూర్తిగా ముగియనుంది. కె.ఎస్. రవికుమార్ దర్సకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పూర్తి స్థాయి యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ చిత్రాన్ని సంక్రాతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయనున్నారు. సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

 
Like us on Facebook