20 గెటప్స్ లో కనిపించనున్న బాలక్రిష్ణ !

4th, February 2018 - 10:53:55 AM

నందమూరి బాలక్రిష్ణ నిన్న హైదరాబాద్లో భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న సంగతి తెలిసిందే. పూర్తిగా కోలుకున్నాక ఆయన తిరిగి ఎన్టీఆర్ బయోపిక్ పనుల్లోకి దిగనున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనుల్ని శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకు రూ.60 కోట్ల భారీ బడ్జెట్ ను కేటాయించినట్లు సమాచారం. ఈ సినిమాలోని పాత్రల చిత్రికరణ కోసం హాలీవుడ్ నిపుణుల బృందం పనిచేస్తోందిట.

సుమారు 70 కి పైగా పాత్రలున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ ను నాలుగు దశలలో చూపిస్తారట. వాటిలో ముఖ్యమైన దశలోని రామారావుగా బాలక్రిష్ణ కనిపిస్తారట. ఈ సినిమా కోసం దగ్గర దగ్గర 20 గెటప్స్ ట్రై చేయనున్నాడట బాలక్రిష్ణ. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి నిర్మించనున్న ఈ సినిమాను తేజ డైరెక్ట్ చేయనున్నారు.