బాలయ్య కూడా పవన్ టైమింగ్ లోనే.?

Published on Sep 17, 2020 7:00 am IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన హిట్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో తన హ్యాట్రిక్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు కొంత షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం అప్పుడు బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ తో మంచి హైప్ ను తెచ్చుకుంది.

అయితే ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా కొన్నాళ్ల పాటు షూటింగ్స్ వాయిదా పడి ఇప్పుడిప్పుడే మళ్లీ మొదలవుతున్నాయి.అలాగే ఈ చిత్రం షూటింగ్ మళ్లీ పునః ప్రారంభం అయ్యేందుకు బాలయ్య డిసెంబర్ లో డేట్స్ ఇచ్చినట్టు ఇపుడు తెలుస్తుంది. అయితే ఇదే డిసెంబర్ నెలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తాను నటిస్తున్న తాజా చిత్రం “వకీల్ సాబ్” కు డేట్స్ ఇచ్చారు.

బహుశా ఈ నెలలో షూట్ లో పాల్గొననున్న స్టార్ హీరోలు కూడా ఈ ఇద్దరే లిస్ట్ లో ఉన్నారు. పైగా ఈ రెండు చిత్రాలకు కూడా థమనే సంగీతం అందిస్తుండడం మరో యాదృచ్చిక అంశం వీటిలో “వకీల్ సాబ్” ను థియేటర్స్ ఓపెనింగ్ ను బట్టి విడుదల చేయనుండగా బాలయ్య బోయపాటిల చిత్రం మరింత టైం తీసుకోనుంది.

సంబంధిత సమాచారం :

More