బాలయ్య – బోయపాటిల కన్ను కూడా అప్పుడే పడిందా?

Published on Sep 20, 2020 3:08 pm IST

ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ తన ఆల్ టైం హిట్ దర్శకుల్లో ఒకరైన బోయపాటి శ్రీనుతో కలిసి ముచ్చటగా హ్యాట్రిక్ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేసేసారు. ఇంకా ఎలాంటి టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రం కేవలం టీజర్ తోనే భారీ అంచనాలను నెలకొల్పుకుంది. ఇంతకు ముందే “సింహా”, “లెజెండ్” లాంటి సూపర్ డూపర్ హిట్లు అందుకున్న ఈ కాంబోలో అదే జోరును కొనసాగించాలని నందమూరి అభిమానులు అనుకుంటున్నారు.

అయితే ఈ చిత్రం ఇప్పటి వరకు కొంత భాగం మాత్రమే పూర్తయ్యింది. మిగతా షూట్ ను తొందరలోనే పూర్తి చేసేయాలని మొదలుపెట్టి అంతే తొందరగా పూర్తి చేసేయాలని భావిస్తున్నారట. అంతే కాకుండా వచ్చే సంక్రాంతి రేసు పైనే వీరు కన్నేసినట్టు ఇప్పుడు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే సంక్రాంతి రేస్ లో భారీ చిత్రాలు ఉన్నాయి. మరి ఏఈ కాంబో కూడా అప్పుడే వస్తుందా లేదా అన్నది చూడాలి. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More