బాబాయ్-అబ్బాయ్ ఆ విషయంలో జాగ్రత్త పడితే మంచిది.

Published on Feb 26, 2020 9:17 am IST

ఎన్టీఆర్ నటవారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన బాలకృష్ణ సూపర్ సక్సెస్ అయ్యారు. ఆయన టాలీవుడ్ లో టాప్ హీరోలలో ఒకరిగా ఎదిగారు. దశాబ్దాలుగా స్టార్ హీరోగా కొనసాగి అనేక బ్లాక్ బస్టర్స్ తన ఖాతాలో వేసుకున్నారు. బాలయ్య తరువాత ఆ కుటుంబం నుండి వచ్చిన వారిలో జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ స్టార్ హోదా దక్కించుకున్నారు. తారక రత్న అసలు ఇండస్ట్రీలో గుర్తింపు కోల్పోగా కళ్యాణ్ రామ్ పరవాలేదనిపించాడు. ఐతే గత కొంత కాలంగా బాలకృష్ణ మరియు కళ్యాణ్ రామ్ గడ్డు పరిస్థితులు ఎదుర్కుంటున్నారు.

ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన బాలయ్య ఆ స్థాయి విజయం అందుకొని చాలా కాలం అవుతుంది. మార్కెట్ పరంగా కూడా బాలకృష్ణ చాల కోల్పోయినట్లు గత చిత్రాల వసూళ్లు చూస్తే అర్థం అవుతుంది. మరో ప్రక్కన కళ్యాణ్ రామ్ పరిస్థితి కూడా అలానే ఉంది. పటాస్ హిట్ తరువాత 118 హిట్ కాగా ఈ సంక్రాంతి మూవీ ఎంత మంచివాడవురా రూపంలో మరో పరాజయం అందుకున్నారు. వీరిద్దరికి మంచి నందమూరి ఫ్యామిలీ ఫ్యాన్ బేస్ ఉంది. ఓ మంచి కథ పడితే భారీ హిట్ అందుకోవడం ఖాయం. కాబట్టి స్క్రిప్ట్స్ విషయంలో బాబాయ్ అబ్బాయిలు జాగ్రత్త వహించి ఎంపిక చేసుకుంటే మంచి విజయాన్ని అందుకోవడం అసాధ్యం కాదు. బాలయ్య తనకు రెండు హిట్స్ ఇచ్చిన బోయపాటితో చేస్తున్నారు. ఈ చిత్రం ఫ్యాన్స్ విజయ దాహం తీర్చుతుందని గట్టినమ్మకం పెట్టుకున్నారు. మరి బోయపాటి బాలయ్యకు ఎలాంటి ఫలితం ఇస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :