మహానాయకుడు భారీ విజయం సాధిస్తాడట !

Published on Jan 16, 2019 11:52 am IST

నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్స్ లో మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ జనవరి 9న విడుదలై మంచి పాజిటివ్ టాక్ తో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే.

కాగా సంక్రాంతి సందర్భంగా నిన్న మీడియాతో బాలయ్య మాట్లాడుతూ.. “సంక్రాంతి పండుగ సందర్భంగా గతంలో విడుదలైన నా సినిమాలన్నీ విజయవంతమయ్యాయి. ఎన్టీఆర్ కథానాయకుడు కూడా ఆ విజయాన్ని కొనసాగించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎన్టీఆర్ మహానాయకుడు కూడా భారీ విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను” అని బాలకృష్ణ అన్నారు.

కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ బయోపిక్లో రెండో పార్ట్ ‘మహానాయకుడు’ను ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నారు. ఎన్ బి కె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్ ,విబ్రి మీడియా సంయుక్తంగా ఈ బయోపిక్ ను నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :