సంక్రాంతికి బాలయ్య సినిమా కూడా.. !

Published on Sep 19, 2020 6:21 pm IST

బాలయ్య బాబు బోయపాటి శ్రీను సినిమా వచ్చే వారం షూటింగ్ రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. కేవలం సింగిల్ షెడ్యూల్ లోనే షూట్ చేసి.. ఈ సినిమాని త్వరగా పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఎలాగూ 2021 జనవరి నాటికి థియేటర్లు తెరుస్తాయని స్పష్టమవుతోంది. అందుకే బాలయ్య ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి సందర్భంగా జనవరి 15న పెద్ద ఎత్తున విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. పవన్ వకీల్ సాబ్ ను కూడా జనవరి 14న రిలీజ్ చేయాలనుకుంటున్నారు.

ఇక ఈ సినిమా టైటిల్‌ పై అనేక రూమర్స్ వచ్చినా, ఈ చిత్రానికి ‘మోనార్క్‌’ అనే టైటిల్‌ ను ఫిక్స్ చేశారని టాక్‌. దసరాకి ఈ టైటిల్‌ ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన కొత్త హీరోయిన్ నటిస్తోంది. మొత్తానికి బాలయ్య జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు.

కాగా బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించారు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ద్వారక క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More