బాలయ్య ‘అఖండ’కి కూడా బ్రేక్ పడింది !

Published on Apr 25, 2021 1:23 am IST

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నట సింహం బాలయ్య బాబు హీరోగా రాబోతున్న ‘అఖండ’ సినిమా షూటింగ్ కి రేపటి నుండి బ్రేక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. రోజురోజుకూ కరోనా కేసులు ఎక్కువుగా నమోదు అవుతున్నా.. బాలయ్య మాత్రం తన సినిమా షూటింగ్ ను ఆపలేదు. అయితే ప్రస్తుత షెడ్యూల్ రేపటితో ముగుస్తోన్న నేపథ్యంలో మొత్తానికి షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇక అఖండ టీజర్ లో బాలయ్య అఘోర పాత్రలో రౌద్రంగా కనిపించి అలరించారు. అన్నట్టు ఈ సినిమాలో ఆధ్యాత్మికతతో ఈ అఘోర పాత్ర చాల వైవిధ్యంగా అలాగే ప్రేరణాత్మకంగా ఉండబోతుందట.

ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్, పూర్ణ నటిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా సంగీత దర్శకుడు తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇక బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించారు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. బాలయ్య కూడా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం :