హీరోగా బండ్ల గణేష్ ఎంట్రీ..అసలు వివరాలు ఇవే.!

Published on Aug 20, 2021 4:32 pm IST

టాలీవుడ్ ప్రముఖ నటుడు అలాగే బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ అయినటువంటి బండ్ల గణేష్ కథానాయకుడిగా అవతరించనున్నారా అంటే దానికి సమాధానం అవుననే ఇప్పుడు వినిపిస్తుంది.. ఆయన హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది.‌ వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ… యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్1గా స్వాతి చంద్ర నిర్మిస్తున్న సినిమాలో బండ్ల గణేష్ హీరోగా నటించనున్నారు. సెప్టెంబర్ తొలివారంలో సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.మరి ఈ సందర్భంగా దర్శక – నిర్మాతలు మాట్లాడుతూ

“బండ్ల గణేష్ అయితేనే హీరో పాత్రకు న్యాయం చేయగలుగుతారని సంప్రదించాం.‌ ఆయన ఓకే చెప్పడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా కోసం ఆయన ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నారు. తమిళంలో ఆర్. పార్తిబన్ గారు హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన బ్లాక్ బాస్టర్ సినిమా ‘ఒత్తు సెరుప్పు సైజ్ 7’కి‌ రీమేక్ ఇది. పార్తిబన్ గారికి జాతీయ పురస్కారంతో పాటు స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. సినిమాకు పలు పురస్కారాలు దక్కాయి.‌ సెప్టెంబర్ తొలి వారంలో చిత్రీకరణ ప్రారంభిస్తాం” అని చెప్పారు. ఈ చిత్రానికి అరుణ్ దేవినేని సినిమాటోగ్రఫీ అందిస్తుండగా గాంధీ ఆర్ట్ డైరెక్షన్ గా వర్క్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :