ప్రారంభమైన నాగార్జున “బంగార్రాజు” చిత్రం!

Published on Aug 20, 2021 12:54 pm IST

సోగ్గాడే చిన్ని నాయన చిత్రం తో టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన నాగార్జున మరొకసారి సీన్ రిపీట్ చేసేందుకు సిద్దం అయ్యారు. ఈ సారి కుమారుడు నాగ చైతన్య తో కలిసి ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అయ్యారు. తాజాగా ఈ చిత్రం ను ప్రారంభించడం జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఈ చిత్రం ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రం లో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా, నాగ చైతన్య సరసన హీరోయిన్ గా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తుంది. మనం లాంటి ఫీల్ గుడ్ ఎంటర్ టైన్మెంట్ తర్వాత నాగార్జున మరియు నాగ చైతన్య లు కలిసి నటిస్తున్న చిత్రం కావడం తో సినిమా పై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్ అందిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ వచ్చే వారం నుండి మొదలు కానుంది.

సంబంధిత సమాచారం :