ఓటిటిలో “ఈగల్” కంటే ముందు రవితేజ మరో చిత్రం ర్యాంపేజ్

ఓటిటిలో “ఈగల్” కంటే ముందు రవితేజ మరో చిత్రం ర్యాంపేజ్

Published on Feb 29, 2024 9:00 AM IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “ఈగల్”. రవితేజ కెరీర్ లోనే కాకుండా టాలీవుడ్ నుంచి కూడా ఇదొక యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చి మూవీ లవర్స్ కి మంచి ఫీస్ట్ ని ఇచ్చింది. అయితే కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ చిత్రం జస్ట్ నిన్ననే ఓటిటి రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకోగా దీని కంటే ముందు రవితేజ మరో చిత్రం అయితే ఓటిటి లో రాంపేజ్ సెట్ చేసింది. ఈగల్ కంటే ముందు రవితేజ నటించిన మరో భారీ చిత్రం “టైగర్ నాగేశ్వరరావు” కోసం తెలిసిందే.

మరి పాన్ ఇండియా వైడ్ గా వచ్చిన ఈ చిత్రం మొన్ననే ప్రైమ్ వీడియోలో హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ కి వచ్చింది. మరి ఈ గ్యాప్ లోనే ఈ చిత్రం అందులో ఇండియా వైడ్ గా టాప్ 5 లోకి వచ్చేసింది. ప్రస్తుతం అయితే ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో టాప్ 4 లో ట్రెండ్ అవుతుంది. దీనితో రవితేజ సినిమాలకి హిందీ వెర్షన్ లో రెస్పాన్స్ ఎలా ఉంటుందో అనేది మరోసారి ప్రూవ్ అయ్యిందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహించగా అభిషేక్ అగర్వాల్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు