షూట్ స్టార్ట్ చేసిన ‘అల్లుడు అదుర్స్’ !

Published on Sep 21, 2020 11:23 am IST

‘రాక్షసుడు’ సినిమాతో మంచి హిట్ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ రెట్టించిన ఉత్సాహంతో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అల్లుడు అదుర్స్’ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటెర్టైనర్ గా రానున్న ఈ సినిమా షూట్ ఈ రోజు హైదరాబాద్‌లో తిరిగి ప్రారంభమైంది, బెల్లంకొండ శ్రీనివాస్ మరియు ప్రకాష్ రాజ్ పై ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఇక ఇఈ సినిమాలో బెల్లాకొండ శ్రీనివాస్ సరసన నభా నటేష్, అనూ ఇమాన్యుల్ కథానాయికలుగా నటిస్తున్నారు.

ఇక ఈ ‘అల్లుడు అదుర్స్’ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్ర టీజర్‌ను కూడా త్వరలో రిలీజ్ చేయనున్నారు. అలాగే 2021 సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాని విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు మేకర్స్. ఇక గతంలో సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ‘కందిరీగ’ ఫార్మాట్లో ఉంటుందట.

‘కందిరీగ’లో మంచి ఫన్ ఉన్నట్టే ఇందులో కూడా డీసెంట్ ఫన్ ఉంటుందట. అలాగే అందులో ఒక కీ రోల్ చేసిన సోనూ సూద్ ఈ చిత్రంలో కూడా ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. మొత్తానికి ఈసారి కమర్షియల్ హిట్ అందుకోవాలని బెల్లంకొండ హీరో గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. సుబ్రహ్మణ్యం గొర్రెలా ఈ చిత్రాన్ని సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More