బెల్లంకొండ శ్రీనివాస్ నెక్స్ట్ సినిమా ఖరారు !
Published on Feb 18, 2018 9:17 am IST

అల్లుడు శీను సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన బెల్లం కొండ శ్రీనివాస్ ఆ తరువాత స్పీడున్నోడు , జయ జానకి నాయక సినిమాతో అలరించాడు. తాజాగా ఈ హీరో శ్రీవాస్ దర్శకత్వంలో సాక్షం సినిమాలో నటిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఈ ఏడాది వేసవిలో విడుదల కానుంది. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో అభిషేక్ నమ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమా తరువాత బెల్లం కొండ శ్రీనివాస్ చేయబోయే కొత్త సినిమా కు సంభందించి కొన్ని వార్తలు బయటికి వచ్చాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. తాజా సమాచారం మేరకు శ్రీనివాస్ రెడ్డి అనే నూతన దర్శకుడితో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. ఈ నెల 23 న ప్రారంభం కానున్న ఈ సినిమా మర్చి 2 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇద్దరు హీరోయిన్స్ ఈ సినిమాలో నటించే అవకాశం ఉంది. మల్టి డైమెంక్షన్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కనుంది. థమన్ సంగీతం అందించబోతున్న ఈ సినిమాకు చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చెయ్యనున్నారు.

 
Like us on Facebook