హాఫ్ మిలియన్ దిశగా దూసుకుపోతున్న ‘భాగమతి’ !

అనుష్క నటించిన ‘భాగమతి’ చిత్రం శుక్రవారం విడుదలై తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో సైతం భారీ వసూళ్లను రాబట్టుకుంది. 120 లొకేషన్లలో ప్రీమియర్లు, శుక్రవారం 2.77 లక్షల డాలర్లను రాబట్టిన ఈ చిత్రం శనివారం 1.63 లక్షల డాలర్లను వసూలు చేసింది. ఇంకా కొన్ని లొకేషన్ల నుండి వసూళ్ల వివరాలు అందాల్సి ఉంది.

ఈ మొత్తాన్ని కలుపుకుంటే హాఫ్ మిలియన్ డాలర్ కు చాలా చేరువగా ఉన్నాయి కలెక్షన్స్. ట్రేడ్ వర్గాల అంచనాలు ప్రకారం ఈరోజు ఆదివారం నాటికి చిత్రం హాఫ్ మిలియన్ ను అందుకోనుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఆదివారం వసూలు ఇంకాస్త మెరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జి. అశోక్ తెరకెక్కించిన ఈ చిత్రం అనుష్క కెరీర్లో ఇంకో మంచి విజయంగా నిలవనుంది.