‘భాగమతి’ ఓవర్సీస్ వసూళ్ల వివరాలు!

జి. అశోక్ దర్శకత్వంలో లేడీ సూపర్ స్టార్ అనుష్క నటించిన చిత్రం ‘భాగమతి’కి తెలుగునాట ఎంత క్రేజ్ ఉందో యూఎస్ బాక్సాఫీస్ వద్ద కూడా అంతే క్రేజ్ నెలకొంది. ఈ క్రేజ్ వలన సినిమాకు ప్రీమియర్స్ రూపంలో మంచి ఓపెనింగ్స్ దక్కాయి. 120 లొకేషన్లలో ప్రీమియర్లు, శుక్రవారం 2.77 లక్షల డాలర్లను రాబట్టిన ఈ చిత్రం శనివారం 2.4 లక్షల డాలర్లను అందుకుని మొత్తంగా 5.19 లక్షల డాలర్లను ఖాతాలో వేసుకుంది.

దీంతో కేవలం రెండు రోజుల్లోనే హాఫ్ మిలియన్ దాటిపోయిందీ చిత్రం. ఇక ఈరోజు ఆదివారం సెలవుదినం కావడంతోఈ ఈ వసూళ్లు ఇంకా మెరుగ్గా ఉండనున్నాయి. ఇలాగే ఇంకో మూడు రోజుల పాటు స్టడీగా కొనసాగితే సులభంగా మిలియన్ మార్కును అందుకునే ఛాన్సుంది. అనుష్క పెర్ఫార్మెన్స్, రవీందర్ ఆర్ట్ వర్క్, అశోక్ స్క్రీన్ ప్లే హైలెట్ గా నిలిచిన ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది.