ఈ డేట్ న మళ్ళీ థియేటర్స్ లోకి రాబోతున్న “భారతీయుడు”

ఈ డేట్ న మళ్ళీ థియేటర్స్ లోకి రాబోతున్న “భారతీయుడు”

Published on May 26, 2024 4:00 PM IST

లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “భారతీయుడు 2” కోసం తెలిసిందే. మరి ఈ చిత్రాన్ని దర్శకుడు శంకర్ తెరకెక్కించగా దీనికి ప్రీక్వెల్ “భారతీయుడు” ఎలాంటి సంచలనం సెట్ చేసిందో అందరికీ తెలుసు.ఇక ఇప్పుడు వైరల్ గా మారిన రీ రిలీజ్ ట్రెండ్ లో భాగంగా భారతీయుడు 1 ఇప్పుడు థియేటర్స్ లోకి మరోసారి వచ్చేందుకు సిద్ధం అయ్యింది.

సినిమా ఒరిజినల్ నిర్మాణ సంస్థ శ్రీ సూర్య మూవీస్ వారు ఇప్పుడు కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమా ఈ జూన్ 7న మన తెలుగులో అలాగే తమిళ్ లో కూడా ఏకకాలంలో రిలీజ్ చేయనున్నట్టుగా తెలిపారు. ఇపుడు ఆల్రెడీ భారతీయుడు 2 బజ్ బాగా ఉంది ఈ ఈ మూమెంట్ లో ఈ సినిమా రీ రిలీజ్ ప్లాన్ బాగుందని చెప్పాలి. మరి భారతీయుడు 1 లో మనీషా కొయిరాలా, ఊర్మిళ, సుకన్య తదితరులు నటించగా ఏ ఆర్ రెహమాన్ సెన్సేషనల్ ఆల్బమ్ ని అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు