భరత్ అనే నేను కొత్త విడుదల తేది !

డివివి దానయ్య నిర్మాతగా కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న సినిమా భరత్ అనే నేను. కైరాఅద్వాని హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా మొదట ఏప్రిల్ 27న విడుదల కాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. కాని తాజాగా ఈ సినిమా ఒకరోజు ముందు వస్తుందని నిర్మాతలు వెల్లడించారు. ఏప్రిల్ 26 న భరత్ అనే నేను ప్రేక్షకుల ముందుకు రాబోతుండడం విశేషం.

కొరటాల శివ తీసిన అన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి. అలాగే కొరటాల శివ, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తోన్న రెండో సినిమా కావడంతో ఈ సినిమాపై భారి అంచనాలు ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా పొలిటికల్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.