విడుదల వరకు ‘భరత్ అనే నేను’ ప్లానింగ్ ఇదే !

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘భరత్ అనే నేను’. ఇటీవలే క్లిమక్ షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఫైబరువురి 10 వరకు రామోజీ ఫిల్మ్ సిటీలోనే షూటింగ్ జరుపుకోనుందట. అనంతరం ఫిబ్రవరి చివరి నాటికి పూణేలో ఒక పాటను, హైదరాబాద్లో రెండు పాటల్ని పూర్తి చేసుకోనుంది.

దాని తర్వాత 16 రోజులపాటు విదేశాల్లో చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ ఫారిన్ షెడ్యూల్లో ఒక పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రికరించనున్నారు. దీంతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ముందుగా అనుకున్న ప్రకారమే ఏప్రిల్ 27న సినిమాను రిలీజ్ చేయనున్నారు. కొరటాల డైరక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దానయ్య నిర్మిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.