శ్రీవిష్ణుకి ‘భీమ్లా’ డైరెక్టర్ స్పెషల్ కంగ్రాట్స్.!

Published on Aug 19, 2021 6:57 pm IST

ఈరోజు విడుదల కాబడినటువంటి చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు హీరోగా నటించిన ఇంట్రెస్టింగ్ చిత్రం “రాజ రాజ చోర” కూడా ఒకటి. మొదటి నుంచి ఈ సినిమా కంటెంట్ విషయంలో చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్న శ్రీవిష్ణు ఈ సినిమా రిజల్ట్ తో తన నమ్మకం నిజం అని ప్రూవ్ చేసుకున్నాడు. ప్రీమియర్స్ తోనే సాలిడ్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఫలితంపై ఇతర సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

అయితే ఈ సినిమా హీరో శ్రీ విష్ణు కి ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో “భీమ్లా నాయక్” అనే పవర్ ఫుల్ మాస్ చిత్రం తెరకెక్కిస్తున్న దర్శకుడు సాగర్ చంద్రకి ముందు నుంచి కూడా మంచి బాండింగ్ ఉంది. మరి దానితోనే ఇప్పుడు సాగర్ తన స్పందనను శ్రీ విష్ణు అండ్ చిత్ర యూనిట్ కి తెలియజేసారు. ఈ చిత్రంతో సూపర్ హిట్ కొట్టినందుకు తన ఫ్రెండ్ శ్రీ విష్ణుకి అలాగే దర్శకుడు హషిత్ కి కూడా స్పెషల్ కంగ్రాట్స్ చెబుతున్నాని అలాగే ఎంటైర్ టీమ్ కి కూడా తెలుపుతున్నాని భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర తెలిపాడు.

సంబంధిత సమాచారం :