హాట్.. “లాలా భీమ్లా” ప్రోమో అదిరిపోయిందిగా..!

Published on Nov 3, 2021 9:49 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి హీరోలుగా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియం’ చిత్రాన్ని సాగర్ కె చంద్ర “భీమ్లా నాయక్‌” పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే వదిలిన పవన్ కళ్యాణ్ టీజర్‌కు, టైటిల్ సాంగ్‌కు, రానా ఫ‌స్ట్ గ్లింప్స్‌కి, రెండో పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

అయితే తాజాగా ఈ చిత్రం నుంచి “లాలా భీమ్లా” వీడియో ప్రోమోను విడుదల చేసింది చిత్ర బృందం. ఆద్యంతం యాక్షన్‌ ఎలిమెంట్లతో సాగే ఈ సాంగ్‌ ప్రోమో అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. ఇందులో నాగరాజు గారు హార్ట్‌లీ కంగ్రాచ్‌లేషన్స్ అండి.. మీకు దీపావళి పండుగ ముందుగానే వచ్చేసింది.. హ్యాపీ దీపావళి అంటూ పవన్ చెప్పిన డైలాగ్ దుమ్ము రేపేలా ఉంది. ఇక ‘లాలా భీమ్లా’ పాట ఫుల్ వీడియోను నవంబర్ 7న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకురానుంది.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More