భీమ్లా “అడవి తల్లి” సాంగ్ పాడింది ఎవరో తెలుసా?

Published on Dec 5, 2021 3:00 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి హీరోలుగా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియం’ చిత్రాన్ని సాగర్ కె చంద్ర “భీమ్లా నాయక్‌” పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, గ్లింప్స్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా విడుదలైన ‘అడవి తల్లి’ అనే పాట కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌ని షేక్ చేస్తుంది. ఈ పాటను ఫోక్ సింగర్ కుమ్మరి దుర్గవ్వ, సాహితి చాగంటి కలిసి ఆలపించారు

మంచిర్యాల జిల్లాకు చెందిన కుమ్మరి దుర్గవ్వ ఈ పాటను పాడింది. ఆమె చదువుకోలేదు. కేవలం తెలుగులోనే కాకుండా మరాఠీలోనూ ఆమె అనేక పాటలు పాడారు. ఈమె పాడిన ఉంగురమే రంగైనా రాములాల టుంగురమే, సిరిసిల్లా చిన్నది వంటి పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :