నైజాంలో “భీమ్లా నాయక్” ఆరో రోజు వసూళ్ల వివరాలు.!

Published on Mar 3, 2022 1:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి లాంటి ఇద్దరు పవర్ ఫుల్ హీరోలతో దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కించిన లేటెస్ట్ భారీ సినిమా “భీమ్లా నాయక్”. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఇప్పుడు మంచి రన్ తో కొనసాగుతుంది. అయితే ఈ చిత్రం మొదటి రోజు నుంచి కూడా నైజాం లో అదిరే వసూళ్లు అందుకుంటున్న సంగతి తెలిసిందే.

మొన్న శివరాత్రికి మళ్ళీ సాలిడ్ వసూళ్లు అక్కడ వసూలు చెయ్యగా ఇప్పుడు ఆరవ రోజుకి సంబంధించి వసూళ్ల వివరాలు తెలుస్తున్నాయి. ఈ చిత్రం 6వ రోజు గాను 1.02 కోట్ల షేర్ ని రాబట్టినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనితో ఈ చిత్రం నైజాం లో 33 కోట్ల మేర షేర్ కి చేరుకున్నట్టు తెలుస్తుంది.

మొత్తానికి అయితే నైజాం లో భీమ్లా నాయక్ మంచి రన్ నే హోల్డ్ చేసాడని చెప్పాలి. మరి కంప్లీట్ రన్ ఎక్కడ వరకు వస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందివ్వగా త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే అందించారు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :