100 కోట్ల క్లబ్‌లో చేరిన “భూల్ భులాయియా”

Published on May 29, 2022 8:51 pm IST


బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ మరియు కియారా అద్వానీ నటించిన భూల్ భులాయియా 2 బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డ్ సృష్టించింది. మే 20, 2022 న విడుదలైన ఈ హారర్ కామెడీ మూవీకి అనీజ్ బజ్మీ దర్శకత్వం వహించారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ సినిమా తాజాగా 100 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరింది.

9వ రోజు 11.35 కోట్లు వసూళ్లు సాధించింది ఈ చిత్రం. ఇటీవలి కాలంలో బాలీవుడ్‌లో విడుదలైన ఏ చిన్న బడ్జెట్ సినిమాకైనా ఇది చాలా పెద్దది. ఇప్పటివరకు ఈ సినిమా దాదాపు వద్ద 110 కోట్ల రూపాయల తో బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ ను సొంతం చేసుకుంది. T- సిరీస్ మరియు సినీ 1 స్టూడియోస్ ద్వారా నిర్మించబడిన ఈ చిత్రం రాబోయే రోజుల్లో ఎంత వసూళ్లను రాబడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :