ప్రస్తుతం అక్కినేని వారి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ చైతన్య హీరోగా ‘వృష కర్మ’ అనే భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఒక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ గా రాబోతుంది. మరి ఈ సినిమా తర్వాత నాగ చైతన్య మరో క్రేజీ థ్రిల్లర్ కోసం సిద్ధం అయ్యాడు. అదే తన ఓటిటి సూపర్ హిట్ సిరీస్ దూత సీజన్ 2.
దర్శకుడు విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన ఈ హారర్ థ్రిల్లర్ సిరీస్ కి సీజన్ 2 ని మేకర్స్ రీసెంట్ గానే షురూ చేశారు. ఇక దీనిపై మరో ఇంట్రెస్టింగ్ బజ్ ఇపుడు వినిపిస్తుంది. దీని ప్రకారం ప్రముఖ నటి భూమిక కీలక పాత్ర చేయనున్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ భూమిక నాగ చైతన్యతో ‘సవ్యసాచి’ సినిమాలో కనిపించిన సంగతి తెలిసిందే.
సో ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరి కలయిక రిపీట్ కానుంది అని చెప్పవచ్చు. గత సీజన్ లో ప్రింట్ మీడియా కాన్సెప్ట్ ఆధారంగా థ్రిల్ చేస్తే ఈసారి విక్రమ్ కొత్త కాన్సెప్ట్ తో రాబోతున్నారని తెలుస్తుంది. ఈ సిరీస్ కి నాగ చైతన్య హీరోగా నటించడమే కాకుండా నిర్మాతగా కూడా తన మొదటి ప్రాజెక్ట్ గా స్టార్ట్ చేసాడు.


