తెలుగు రాష్ట్రాల్లో ‘బిచ్చగాడు – 2’ డే 1 కలెక్షన్ డీటెయిల్స్

Published on May 20, 2023 8:01 pm IST

విజయ్ ఆంటోనీ హీరోగా కావ్య థాపర్ హీరోయిన్ గా ఫాతిమా విజయ్ ఆంథోనీ భారీ స్థాయిలో నిర్మించిన లేటెస్ట్ మూవీ బిచ్చగాడు 2. ఏడేళ్ల క్రితం రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సొంతం చేసుకున్న బిచ్చగాడు కి సీక్వెల్ గా రూపొందిన బిచ్చగాడు 2 పై అటు తమిళ్ తో పాటు తెలుగు ఆడియన్స్ లో కూడా మొదటి నుండి మంచి అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ మూవీకి సంగీతం అందించడంతో పాటు స్వయంగా దర్శకత్వం వహించారు విజయ్ ఆంథోనీ. కాగా నిన్న భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఫస్ట్ డే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ రూ. 4 .5 కోట్ల కలెక్షన్ ని సొంతం చేసుకుంది. ఇది విజయ్ ఆంథోనీ కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్. కాగా తమ సినిమాకి తెలుగు ఆడియన్స్ నుండి ఇంత మంచి రెస్పాన్స్ లభిస్తుండడం ఆనందంగా ఉందని అంటోంది బిచ్చగాడు 2 మూవీ యూనిట్. మరి రాబోయే రోజుల్లో ఈ మూవీ ఎంత మేర కొల్లగొడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :