‘బాహుబలి-1,2’ తర్వాత ఆ ఘనత సల్మాన్ సినిమాదే

Published on Jan 28, 2020 7:21 pm IST

ఇండియన్ సినిమా స్టార్ హీరోల్లో ఎంత బడ్జెట్ పెట్టి సినిమా తీసినా వెనక్కి రాబట్టగల స్టామినా ఉన్నవారిలో సల్మాన్ ఖాన్ ఒకరు. ఈయనతో ప్రాజెక్ట్ అంటే నిర్మాతలు భయం లేకుండా పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తుంటారు. ప్రస్తుతం సల్మాన్ ప్రభుదేవా దర్శకత్వంలో ‘రాధే’ అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సొహైల్ ఖాన్, అతుల్ అగ్నిహోత్రిలతో కలిసి సల్మాన్ నిర్మిస్తున్నారు.

ఈ సినిమా క్లైమాక్స్ సీక్వెన్స్ కోసం ఏకంగా రూ.7.5 కోట్లు ఖర్చు పెడుతున్నారట. ఇంత ఖర్చు ఎందుకంటే ఈ సన్నివేశాల కోసం క్రోమా కీ అనే టెక్నాలజీని వాడుతున్నారట. గ్రీన్ మ్యాట్ మీద మొదట షూటింగ్ చేసి ఆ తర్వాత కావాల్సిన లొకేషన్లో ఉన్నట్టు సన్నివేశాలను తయారుచేసుకుంటారు. ఇండియాలో ఇప్పటివరకు ఈ టెక్నాలజీని వాడిన సినిమాలు రెండే రెండు.. అవే ‘బాహుబలి 1, బాహుబలి 2’. వీటి తర్వాత ఆ సాంకేతికతతో రూపొందుతున్న సినిమా ఇదే. ఈ సన్నివేశాలన్నీ ఒక బాటిల్ ఫీల్డ్ మీద జరిగే హెవీ యాక్షన్ సీన్స్. మొత్తానికి సల్మాన్ ఈ సినిమాతో ప్రేక్షకులకు పెద్ద ట్రీట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట.

సంబంధిత సమాచారం :

X
More