బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ కి కన్నీళ్లు పెట్టేశారు.

Published on Aug 4, 2019 2:00 am IST

బిగ్ బాస్ షో రోజు రోజుకి రసవత్తరంగా మారుతూ ఆసక్తికరంగా సాగుతుంది. తెలుగు ప్రేక్షకులు ఈ రియాలిటీ షో కొరకు టీవీ లకు అతుక్కుపోతున్నారని తెలుస్తుంది. ఈ షోకి వస్తున్న టీఆర్పీ రేటింగ్స్ ఇందుకు నిదర్శనం. ఇంటి సభ్యుల మధ్య నడుస్తున్న అల్లర్లు, వివాదాలు,వారి ఎమోషన్స్ కి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. కాగా నిన్న రాత్రి జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ కొందరి సభ్యుల చేత కన్నీళ్లు పెట్టించింది.

బిగ్ బాస్ రెగ్యులర్ గా పెట్టే పవర్,ఫిజికల్ టాస్క్ లు కాకుండా,విభిన్నంగా ఎమోషనల్ టాస్క్ పెట్టారు. దాని ప్రకారం ఇంటిలోని సభ్యులు తమ జీవితంలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని పంచుకోవాలి. ఈ టాస్క్ లో పాల్గొన్న వారిలో యాంకర్ శ్రీముఖి,రవి కృష్ణ,శివ జ్యోతి ఎమోషనల్ అయ్యారు. వారి జీవితంలో జరిగిన చేదు అనుభవాన్ని తలచుకొని కన్నీటి పర్యన్తరం అయ్యారు. ఇది చూస్తున్న ఇంటి సభ్యులతో పాటు, టీవీల ముందున్న ఆడియన్స్ కూడా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు.

సంబంధిత సమాచారం :

More