నాని “శ్యామ్ సింగరాయ్” కి భారీ ఆఫర్!?

Published on Aug 19, 2021 10:00 pm IST

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమా కి భారీ డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. నాని కెరీర్ లోనే ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం కావడం తో సినిమా కి భారీ డిమాండ్ ఉంది. ఈ చిత్రానికి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 40 కోట్ల రూపాయలను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. నిర్మాతలు సైతం ఈ రేటు కి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది. కానీ నాని మాత్రం ఓటిటి విడుదల కి సిద్దం గా లేరని తెలుస్తోంది.

ఇప్పటికే టక్ జగదీష్ చిత్రం ఓటిటి కి విడుదల అయ్యే అవకాశాలు ఉండటం, అదే తరహాలో ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ కూడా ఉండటం తో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. నాని హీరోగా తెరకెక్కుతున్న శ్యామ్ సింగరాయ్ లో కృతి శెట్టి, సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్ లు లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :