కరోనా కష్టాల్లో తెలుగు నిర్మాతల మాట సాయం

Published on Apr 27, 2021 10:04 pm IST

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజు రోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి. రానున్న రోజుల్లో కేసుల సంఖ్య ఇంకా పెరగవచ్చని అంటున్నారు వైద్యులు. పెరుగుతున్న కేసుల కారణంగా ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్, మందుల కొరత అధికంగా ఉంటోంది. ఏ రాష్ట్రంలో చూసినా, ఏ ఆసుపత్రి వద్ద చూసినా కరోనా బాధితులు ఇవే ఇబ్బందులు పడుతున్నారు. ఈ హాస్పిటల్లో బెడ్లు ఖాళీగా ఉన్నాయి, ఏ ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్లు దొరుకుతున్నాయి, ఏ ప్రాంతంలో మెడిసిన్స్ లభిస్తున్నాయి లాంటి సమాచారం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

దీంతో మన తెలుగు నిర్మాణ సంస్థలు అలాంటి వారికి మాట సహాయం చేయాలని నిర్ణయించుకున్నాయి. దిల్ రాజు యొక్క ఎస్విసీసీ, దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్, అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్, సురేష్ ప్రొడక్షన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నీ ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, ముఖ్యమైన మెడిసిన్స్ లాంటి సమాచారాన్ని స్గర్ చేస్తున్నాయి. ఎవరైనా సరే ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తే దాన్ని తమ హ్యాండిల్స్ ద్వారా ఫాలోవర్లతో పంచుకుంటున్నాయి.

సంబంధిత సమాచారం :