బిగ్‌బాస్‌ : గౌతమ్ షాకింగ్ కామెంట్స్ వైరల్

బిగ్‌బాస్‌ : గౌతమ్ షాకింగ్ కామెంట్స్ వైరల్

Published on Dec 4, 2023 12:30 PM IST

బిగ్‌బాస్‌ సీజన్‌-7 లో ఈ వారం గౌతమ్‌ కృష్ణ ఎలిమినేట్‌ అయిన సంగతి తెలిసిందే. అయితే, బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వెళ్లేటప్పుడు హౌస్‌లో ఎవరికి మాస్క్‌ ఉంది, ఎవరికి మాస్క్‌ లేదు అనేది చెప్పాలని గౌతమ్‌ ను నాగార్జున కోరారు. ఈ క్రమంలో హౌస్ మేట్స్ గురించి గౌతమ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇంతకీ, గౌతమ్ ఎవరి గురించి ఏం మాట్లాడాడో చూద్దాం రండి.

యావర్‌ గురించి : బాగా ఆడు. నీకు మాస్క్‌ లేదు.

ప్రశాంత్‌ గురించి : నువ్వు శివాజీ అన్నను కొట్టి నువ్వు పైకి రావాలి.

శోభాశెట్టి గురించి : గేమ్‌పై పోకస్‌ చేయి. అప్పుడప్పుడు మాస్క్‌ వస్తుంది.

శివాజీ గురించి : మీకు చిన్న మాస్క్‌ ఉంది

అర్జున్‌ గురించి : మాస్క్‌ లేదు

అమర్‌ గురించి : మాస్క్‌ వచ్చి పోతుంటుంది. ఫన్నీగా ఉండు.

ప్రియాంక గురించి : నో మాస్క్‌. నిన్ను ఫైనల్‌లో చూడాలి అంటూ గౌతమ్‌ చెప్పుకొచ్చాడు. అయితే, ప్రశాంత్‌ తో శివాజీ అన్నను కొట్టి నువ్వు పైకి రావాలి అని చెప్పడం పై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక బిగ్‌బాస్‌ సీజన్‌-7 ఫైనల్‌ విజేత రూ.50 లక్షల కారు, రూ.15 లక్షల విలువైన ఆభరణాలు గెలుపొందుతారని నాగార్జున తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు