బిగ్‌బాస్ నాన్‌స్టాఫ్: మొదటి వారం ముమైత్ ఖాన్ ఎలిమినేట్?

Published on Mar 6, 2022 12:30 am IST


బిగ్‌బాస్ నాన్‌స్టాఫ్ కార్యక్రమం అప్పుడే తొలివారాన్ని పూర్తి చేసుకుంది. రెగ్యులర్ బిగ్ బాస్ షోలో పాల్గొన్న పాత కంటెస్టెంట్స్ తో పాటు కొత్త కంటెస్టెంట్స్ కలిపి మొత్తం 17 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ షో ఎమోషన్స్‌, గొడవలు, నామినేషన్లతో రసవత్తరంగా సాగుతుంది. ఇక మొదటి వారం నామినేషన్స్‌లో సరయు, ముమైత్ ఖాన్, అరియానా, నటరాజ్ మాస్టర్, హమీదా, మిత్రాశర్మ, ఆర్జే చైతూలు ఉన్నారు. వీరిలో మొదటి వారం హౌస్ నుంచి ఎవరు వెళ్లిపోతారన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ముమైత్‌ ఖాన్‌ హౌస్ నుంచి ఎలిమినేట్‌ అయినట్లు తెలుస్తుంది. నిజానికి చాలా మంది మిత్రాశర్మ ఎలిమినేట్ అవుతుందని భావించారు కానీ లాస్ట్‌ మినిట్‌లో ఓటింగ్‌ తారుమారు అవ్వడంతో ముమైత్ ఎలిమినేట్ అయ్యిందని ప్రచారం జరుగుతుంది. నిజానికి ముమైత్ ఖాన్, సరయు, మిత్రాశర్మ ముగ్గురూ కూడా డేంజర్ జోన్‌లో ఉన్నారు. అన్ అఫీషియల్ ఓటింగ్ ప్రకారం ముమైత్ వీరిద్దరి కన్నా కొద్దిగా ముందంజలో ఉన్నా కూడా అఫీషియల్ ఓటింగ్‌లో వెనకబడి ఉండొచ్చని అంటున్నారు. మరి నిజంగానే ముమైత్‌ ఎలిమినేట్‌ అయ్యిందా? లేదా? అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

సంబంధిత సమాచారం :