లేటెస్ట్..”కేజీయఫ్ 2″ సౌత్ సాటిలైట్ హక్కులు వారికే!

Published on Aug 20, 2021 10:33 am IST

ఇండియన్ సినిమా దగ్గర భారీ అంచనాలతో విడుదలకి రెడీ అవుతున్న పలు బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ చిత్రాల్లో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి. మరి ఇంతలా మోస్ట్ అవైటెడ్ గా ఎదురు చూస్తున్న ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తుండగా మేకర్స్ ఓ శాలి అప్డేట్ ని ఇచ్చారు.

ఈ చిత్రం తాలూకా సౌత్ ఇండియన్ అన్ని కీలక భాషల శాటిలైట్ హక్కులను జీ సంస్థ వారు కొనుగోలు చేసినట్టుగా అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ్, మళయాళం మరియు కన్నడ భాషల తాలూకా హక్కులు జీ టెలివిజన్ సంస్థ వారు కొనుగోలు చేశారు. ఈ అనౌన్సమెంట్ ని చెయ్యడం తనకి ఎంతో సంతోషంగా ఉందని కూడా యష్ కూడా తెలిపాడు. ఇంకా హిందీ హక్కులు ఒకటి హోల్డ్ లో ఉన్నాయి. సంజయ్ దత్ సహా ప్రకాష్ రాజ్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంని హోంబలె పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :