విజయ్ ఆగస్టు లోనే చుట్టేస్తాడట…!

Published on Jul 26, 2019 9:04 pm IST

తలపతి విజయ్, యంగ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బిగిల్’ షూటింగ్ శరవేగంగా దూసుకుపోతుంది. తాజా సమాచారం ప్రకారం ఆగస్టు చివరికల్లా చిత్రీకరణ పూర్తి చేయనున్నారట. దీపావళి కానుకగా విడుదల కానున్న నేపథ్యంలో సెప్టెంబర్ నుండి చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలు మొదలుపెట్టే యోచనలో ఉన్నారు.

నాలుగు విభిన్న పాత్రలలో విజయ్ నటిస్తున్న ‘బిగిల్’ చిత్రంలో ఒక పాత్రలో లేడీ ఫుట్ బాల్ టీమ్ కోచ్ గా విజయ్ చేస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహ్మాన్ స్వరపరచిన ‘సింగే పెన్నేయ్’ అనే ఓ ఇన్స్పిరేషనల్ సాంగ్ ఇటీవల విడుదల చేయడం జరిగింది. విజయ్ కు జోడిగా నయన తార నటిస్తుండగా, జాకీ ష్రాఫ్,ఆనంద్ రాజ్,వివేక్ ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కళాపతి అఘోరం,గణేష్,సురేష్ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :