త్వరలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “బింబిసార”

త్వరలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “బింబిసార”

Published on Dec 25, 2022 5:13 PM IST


నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా డైరెక్టర్ మల్లిది వశిష్ఠ దర్శకత్వం లో తెరకెక్కిన ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ బింబిసార. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. ఈ చిత్రం కళ్యాణ్ రామ్ కెరీర్ కి చాలా ప్లస్ అయ్యింది. ఇప్పుడు ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతోంది. త్వరలో ఈ చిత్రం జీ తెలుగు లో ప్రసారం కానుంది.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హారి కృష్ణ. కె నిర్మించిన ఈ చిత్రం లో సంయుక్త మీనన్, కేథరిన్ థెరిస్సా లు లేడీ లీడ్ రోల్స్ లో నటించారు. ప్రకాష్ రాజ్ మరొక కీలక పాత్రలో నటించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం కి చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు